బాబు ఆ పని చేస్తే కడిగిన ముత్యంలా బయటపడొచ్చు…

September 16, 2020 at 1:26 pm

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  కేసులు నమోదు చేశారు. అటు అమరావతిలో భూకుంభకోణం విషయంలో సీబీఐ చేత విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ విషయంపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది.

అయితే చంద్రబాబు, లోకేష్‌లు కూడా సి‌బి‌ఐకు సహకరిస్తామని కేంద్రానికి లేఖ రాయాలని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబుకు సంబంధం లేకుంటే సీబీఐ విచారణను స్వచ్ఛందంగా కోరితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఇది చక్కటి అవకాశం అని, విచారణ అనంతరం కడిగిన ముత్యంలా బయటపడొచ్చని పేర్కొన్నారు. సీబీఐ విచారణతో బాబు మీద ప్రజలకు ఉన్న అనుమానాలు తొలగిపోతాయన్నారు. కాగా, అమరావతి భూకుంభకోణంలో పలువురు టీడీపీ నేతల పేర్లు కూడా బయటపడిన విషయం తెలిసిందే.

బాబు ఆ పని చేస్తే కడిగిన ముత్యంలా బయటపడొచ్చు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts