బ్లాక్ మెయిల్ చేసి బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. చివరికి..?

September 15, 2020 at 5:24 pm

మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే 16 ఏళ్ల బాలికపై రెండేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సమీర్ అనే వ్యక్తిగా పరిచయం చేసుకుని తన బలహీనతలను ఆసరాగా చేసుకుని రెండేళ్లుగా బ్లాక్మెయిల్ చేస్తూ తనపై అత్యాచారం చేస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు.

పోలీసు విచారణలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 2017 లో మతాంతర వివాహం చేసుకున్న సమీర్ అనే వ్యక్తి…. తర్వాత భార్యతో విడాకులు తీసుకుని… ఆడవారి తో పరిచయం ఏర్పర్చుకొని వివిధ కారణాలతో బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారాలు చేయటం మొదలుపెట్టాడు అన్నది పోలీసు దర్యాప్తులో తేలింది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు

బ్లాక్ మెయిల్ చేసి బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. చివరికి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts