వ్య‌భిచారం త‌ప్పుకాదు.. బాంబే హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

September 26, 2020 at 6:23 pm

బోంబే హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. వ్య‌భిచారం ఏ మాత్రం క్రిమినల్ నేరం కాదని స్పష్టం చేసింది. అయితే, ఉద్దేశపూర్వకంగా లైంగిక చ‌ర్య‌ల‌ను ప్రేరేపించడం, వేశ్య‌వాటిక‌ను నిర్వ‌హించ‌డం మాత్రం నేర‌మ‌ని వెల్ల‌డించారు. అదీగాక ఓ మహిళకు తాను ఏం ప‌ని చేయాలనే నిర్ణ‌యించుకునే హక్కు ఉంటుందని హైకోర్టు తీర్పు చెప్ప‌డం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతున్న‌ది. వివ‌రాల్లోకి వెళ్లితే..

మహారాష్ట్రలోని మజ్‌గావ్‌కు చెందిన ఓ ముగ్గురు మహిళలను వ్యభిచారం నేరం కింద పోలీసులు అరెస్టు చేసి ఏడాదిగా వారిని ప్రభుత్వం నిర్వహించే హోంలోనే ఉంచారు. ఈ నేప‌థ్యంలోనే స‌ద‌రు మహిళలను తమకు అప్పగించాలంటూ వారి తల్లిదండ్రులు, గార్డియన్లు మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్ర‌యించారు. అందుకు ఆ కోర్టు తిరస్కరించ‌డంతో, వారు హైకోర్టులో పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. దీనిని విచారించిన బొంబే హైకోర్టు సంచ‌ల‌న తీర్పును ఇచ్చింది. ఆ ముగ్గురు మహిళలు పెద్దవారని, ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో నిర్ణయించుకునే ప్రాథమిక హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేస్తూ మజ్‌గావ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు. మహిళలను వారి అభీష్టానికి వ్యతిరేకంగా నిర్బంధిచ‌డానికి వీల్లేదని స్పష్టం చేసింది. స‌ద‌రు మహిళలను బాధితులుగా పేర్కొన్నార‌ని,. చట్టం ప్రకారం వారిని మూడు వారాలకు మించి హోంలో వారిని ఉంచడానికి వీల్లేద‌ని తెలిపింది. వ్య‌భిచారం త‌ప్పుకాద‌ని, అయితే ఆర్థికంగా లబ్ధిపొందేందుకు ఓ వ్య‌క్తిని లైగింక చ‌ర్య‌ల‌కు ప్రేరేపించడం నేరమని స్పష్టం చేసింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్, 1956 కింద వ్వభిచారం క్రిమినల్ నేరం కాదని జస్టిస్ పృధ్వీరాజ్ చవాన్ త‌న తీర్పులో చెప్పారు. వెంట‌నే రాష్ట్ర హోంలో ఉన్న ముగ్గురు మహిళలను రిలీజ్ చేయాల‌ని వెల్ల‌డించారు.

వ్య‌భిచారం త‌ప్పుకాదు.. బాంబే హైకోర్టు సంచ‌ల‌న తీర్పు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts