మూడు సింహాల దొంగలు వాళ్లే…సోము బ్యాలెన్స్ చేస్తున్నారు…

September 16, 2020 at 2:00 pm

విజయవాడలోని కనకదుర్గ గుడిలోని వెండి రథంలోని నాలుగు వెండి సింహాల బొమ్మల్లో మూడు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ.. మూడు సింహాలు దొంగలు ఎవరు అనేది మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు, ఈవోకు బాగా తెలుసని ఆరోపించారు. దొంగలని ఖచ్చితంగా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

మూడు సింహాల మాయంపై మంత్రి, ఈవో ప్రకటనలు చూస్తే వాళ్లకి భాగస్వామ్యం ఉందనే అనుమానం కలుగుతుందని, వెండి రతంలో మూడు సింహాలు మాయమైతే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. సోము వీర్రాజు చాలా బ్యాలెన్స్‌గా మాట్లాడారని.. అలా ఎందుకు మాట్లాడారో ఆ దేవుడికే తెలియాలన్నారు.

ఇక వెల్లంపల్లి గుడ్డిగా టీడీపీ హయాంలోనే పోయాయని మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. పోలీస్ కమిటీ వేయకుండా నిజ నిర్ధారణ కమిటీ వేయడం ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా అందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, అమ్మవారి వెండిరథంపై మూడు సింహాలు కనిపించడం లేదని పరిశీలనలో తేలిందని, ఆలయాల్లో రథాల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రథాన్ని ఉపయోగించలేదని, ఘటనపై దేవాదాయశాఖ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు.

 

 

మూడు సింహాల దొంగలు వాళ్లే…సోము బ్యాలెన్స్ చేస్తున్నారు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts