కడప ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్…

September 21, 2020 at 3:48 pm

కడప ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కడపలోని ఎయిర్ పోర్ట్ నిర్మాణం వేగంగా జరుగుతుందని, వచ్చే ఏడాది మార్చి నాటికి కడప విమానాశ్రయం విస్తరణ పనులు పూర్తి అవుతాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిస్తూ కడప ఎయిర్‌పోర్ట్‌లో ప్రస్తుతం ఉన్న రన్‌వే, టాక్సీ వే, ఆప్రాన్‌ వంటి విస్తరణ పనులు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ పనుల కోసం 49 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే 94 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2017లో కడప ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ పనులు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.

అటు కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలు, సిబ్బంది ప్రావిడెంట్‌ ఫండ్‌ చెల్లింపులలో ఊరట కలిగించేందుకు ప్రభుత్వం మార్చి నుంచి ఆగస్టు వరకు 4860 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపినట్లు కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.

కడప ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts