సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ

September 27, 2020 at 7:34 pm

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఇటీవల మరణించిన గానగాంధర్వులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం నెల్లూరులో ఆయన పేరుతో సంగీత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అదే విధంగా సంగీత విశ్వ విద్యాలయంలో బాలు కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలన్నారు.

ఎస్పీ బాలు పేరిట జాతీయ అవార్డును ఏర్పాటు చేయడమే కాకుండా… ప్రభుత్వ సంగీత అకాడెమీకి ఆయన పెట్టాలని సూచిస్తూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అయితే చంద్రబాబు రాసిన లేఖపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే…

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts