ప్రేమ‌పేరుతో వ‌ల‌.. ల‌క్ష‌ల్లో వ‌సూలు.. ఇదీ కిలేడీ దందా

September 30, 2020 at 1:32 pm

నిరుద్యోగ యువ‌త‌ను ఎంచుకుంటుంది. తియ్య‌ని మాట‌ల‌తో స్నేహం మొద‌లు పెడుతుంది. మెల్ల‌గా వ‌ల‌పు విసురుతుంది. ఉద్యోగం ఇప్పిస్తాన‌ని న‌మ్మ‌బ‌లుకుతుంది. ల‌క్ష‌ల్లో వ‌సూలు చేస్తుంది. మోసాన్ని గ్ర‌హించి ఎవ‌రైనా నిల‌దీశార‌నుకో ఇంకేముందు ఎదురు తిరుగుతుంది. త‌న‌తో చేసిన్ ఫోన్ సంభాష‌ణ‌ల‌ను ముందు పెడుతుంది. ఎదురు కేసు పెడ‌తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇదీ ఆ కిలాడీ నిత్య దందా. ఇప్ప‌టికే ఆ వ‌ల‌పు వ‌ల‌లో చిక్కి అనేక మంది యువ‌కులు మోస‌పోయారు. ఎట్ట‌కేల‌కు ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వ‌ల‌వేసి ఆ చిన్న‌దాన్ని ప‌ట్ట‌కుని క‌ట‌క‌టాల వెన్కి నెట్టారు. బాధితులు, పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన యువతీ ఎం ఎల్ టీ చ‌దివింది. కుటుంబీకుల‌తో విడిపోయి కరీంనగర్ ఆదర్శ నగర్లో ఒంటరిగా నివసిస్తోంది. జల్సాలకు అలవాటు పడ్డ ఆ యువతి సులభంగా డబ్బులు సంపాదించేందుకు వ‌క్ర‌మార్గాన్ని ఎంచుకున్న‌ది. కొంత మందితో క‌లిసి మూఠాను ఏర్పాటు చేసింది. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని వారితో ఆడుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగంగా కరీంనగర్ సిఖ్ వాడీ ప్రాంతానికి చెందిన యువకుడిని బుట్ట‌లో వేసుకుంది. వరంగల్ ప్రభుత్వ ద‌వాఖానాలో ఊద్యోగం ఇప్పిస్తానని న‌మ్మ‌బ‌లికి రూ.13.5 లక్షలు వసూలు చేసింది. అదేవిధంగా తిరుమల నగర్ కుచెందిన మరొక వ్యక్తి నుంచి రూ.7 లక్షలు గుంజింది. గోదావరిఖనికి చెందిన మరో యువకుని వద్ద రూ. 3 లక్షలు వసూలు చేసింది. ఇవేగాక వరంగల్ కు చెందిన యువకుడిని త‌న పేరు నిఖితారెడ్డి గా పరిచయం చేసుకుని ముగ్గులోకి దించింది. అతనితో సన్నిహితంగా చాటింగ్ చేసిన సంభాషణలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.8 లక్షలు వసూలు చేసింది. ఈ ముఠాపై అనేక ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ ముఠా ఆట‌క‌ట్టించారు. కిలాడీ యువ‌తితో పాటు, నిందితులు కంబాల రాజేష్, కుసుమ భాస్కర్, భీమా శంకర్ ను అరెస్టు చేశారు. వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ నిందితుల చేతిలో ఎవరైనా మోసపోయిన వారుంటే సంప్రదించాలని సూచించారు. వారి వద్ద నుండి ఇరవై వేల నగదు, నకిలీ నియామక పత్రాలు, మూడు సెల్ ఫోన్ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రేమ‌పేరుతో వ‌ల‌.. ల‌క్ష‌ల్లో వ‌సూలు.. ఇదీ కిలేడీ దందా
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts