ఇంటి కోసం వెళితే జేబు గుల్ల చేశారు..

September 18, 2020 at 7:58 pm

అన్న వ‌స్త్రం కోసం పోతే ఉన్న వ‌స్త్రం పోయిన‌ట్లుంది ప‌రిస్థితి. డ‌బుల్ బెడ్రూం ఇస్తార‌ని ఆశ‌తో వెళ్లితే జేబులు గుల్ల‌‌జేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ఇల్లు ఇప్పిస్తామని ఈ ఘ‌రానా మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్‌ చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బాలానగర్‌ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని తీగ లాగితే డొంకంతా క‌దిలింది. భారీ మొత్తంలో మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు బ‌ట్ట‌బ‌య‌లైన‌ట్లు తెలిసింది. వివ‌రాల్లోకి వెళితే..

పేద‌ల సొంతింటి క‌ల ఇల్లు. దీనిని ఆస‌రాగా చేసుకుని ఓ ముఠా మోసాల‌ను తెగించింది. ఇల్లు ఇప్పిస్తామ‌ని చెప్పి డ‌బ్బులకు టోక‌రా వేశారు. పద్మా , వేంకటేశ్వర రాజు, సత్యకృష్ణ వర ప్రసాద్‌లు ఇలా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో బాధితుడు దగ్గర నుంచి లక్షా 20 వేల నుంచి లక్షా 70 వేల వరకు వసూలు చేశారు. దాదాపు 89 మంది దగ్గర రూ.1 కోటి 3లక్షల దాకా వసూలు చేశారు. ఇందులో ఓ బాధితుడి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. దీనిపై లోతుగా ఆరా తీయ‌గా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూశాయి. ముగ్గురిలో ఇద్దరు నిందితులు సైతం డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో మోసపోయారని పోలీసులు గుర్తించారు. వీరశెట్టి వెంకట్ సాయి కృష్ణ ప్రసాద్ అనే నిందితుడు గతంలోనూ ఇదే త‌ర‌హాలో మోసాల‌కు పాల్ప‌డినట్లు విచారణలో తేలింది. నిందితుల‌ను అదుపులోకి తీసుకుని మ‌రింత లోతుగా విచార‌ణ చేస్తున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రజలు మోస పోవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వం ద్వారానే ఇళ్లు వస్తాయని, అక్రమ పద్దతిలో రావని స్పష్టం చేశారు.

ఇంటి కోసం వెళితే జేబు గుల్ల చేశారు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts