సరిహద్దుల్లో చైనా హైడ్రామా.. ఏం చేసిందో తెలిస్తే షాకే!

September 17, 2020 at 11:42 am

గాల్వన్ లోయ జరిగిన ఘర్షణ త‌ర్వాత భార‌త్, చైనా మ‌ధ్య తీవ్ర వివాదం చేటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భారత జవాన్లు మ‌ర‌ణించ‌డంతో.. చైనా పేరు చెబితేనే భార‌తీయులు మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే చైనాకు బుద్ధి చేపేందుకు భార‌త్ ప్ర‌భుత్వం అనేక కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ షాక్ ఇస్తోంది. అయిన‌ప్ప‌టికీ చైనా త‌న వ‌క్ర‌బుద్ధిని ఏ మాత్రం మార్చుకోవ‌డం లేదు.

ఇటీవల వాస్తవాధీన రేఖ వద్ద 45 ఏళ్ల తర్వాత కాల్పులకు తెగబడ్డ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (సీపీఎల్ఏ) ఈసారి కొత్త ఎత్తులు వేస్తోంది. ఇందులో భాగంగా.. వాస్తవాధీన రేఖ వద్ద ముఖ్యంగా ఫింగర్-4 ప్రాంతంలో భారత దళాల దృష్టి మళ్లించేందుకు చైనా సైనికులు హైడ్రామా చేశారు. ఏకంగా సరిహద్దులకు లౌడ్ స్పీకర్లను తీసుకుని వచ్చిన‌ చైనా సైనికులు నెగెటివ్ వైబ్రేషన్స్ కలిగించే పంజాబీ పాటల‌తో హోరెత్తిస్తూ.. భారత సైనికుల సహనాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే అక్క‌డ‌ భారత జవాన్లు మాత్రం 24 గంటలూ అప్రమత్తంగా ఉంటూ చైనావారి ఆగడాలపై కన్నేయడంతో పాటు.. ఆ సంగీతాన్ని విని ఆస్వాదిస్తున్నార‌ట‌. ` చైనా సైన్యం మన జవాన్లలో అసంతృప్తిని పెంచి, వారిని రెచ్చగొట్టాలని చూస్తోంది. అయితే, ఎంతో యుద్ధతంత్రం తెలిసిన మన జవాన్ల మానసిక స్థితి అందుకు లొంగడం లేదు సరికదా… వారి సంగీతాన్ని విని ఆనందిస్తున్నారు` అని భారత ఆర్మీ అధికారుల్లో ఒక‌రు వెల్ల‌డించారు. మరి చైనా సైనికులు ఈ డ్రామా ఎంతకాలం కొనసాగిస్తారో చూడాలి.

సరిహద్దుల్లో చైనా హైడ్రామా.. ఏం చేసిందో తెలిస్తే షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts