ఆ మూడు వ్యాక్సిన్లుపై చైనా కీల‌క ప్ర‌క‌ట‌న..‌!

September 15, 2020 at 2:36 pm

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో ప్రాణంపోసుకున్న ఈ క‌రోనా మ‌హ‌హ్మారి అంత‌కంత‌కూ విజృంభిస్తూ.. ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు పాకేసింది. ఈ మ‌హ‌హ్మారిని క‌ట్ట‌డి చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.. క‌రోనా ధాటికి ప్ర‌జలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.

ఇదిలా ఉంటే.. కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన‌ చైనా.. వ్యాక్సిన్ల విషయంలో దూసుకుపోతోంది. అంతేకాదు, చైనాలో డెవలప్ అవుతున్న కరోనా వైరస్ వ్యాక్సీన్లు నవంబరు నాటికి సిధ్ధం కావచ్ఛునని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రకటించింది. ప్ర‌స్తుతం చైనా జాతీయ ఫార్మా గ్రూప్ సినోఫార్మ్, సినోవాక్ బయోటెక్ సంయుక్తంగా మూడు వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి.

మరో వ్యాక్సిన్ ను కాన్సినో బయోలాజిక్స్ తయారుచేసింది. ఈ నాలుగు చైనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో చివరి దశకు చేరుకున్నాయి. వీటిలో మూడు వ్యాక్సిన్లు నవంబరు నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని సీడీసీ తెలిపింది. అలాగే మూడో దశ ట్రయల్స్ సజావుగా సాగుతున్నాయని సీడీసీ తెలిపింది.

ఆ మూడు వ్యాక్సిన్లుపై చైనా కీల‌క ప్ర‌క‌ట‌న..‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts