విషాదంలో చిన్న జీయర్ స్వామి …… శోక సంద్రంలో పీఠం..!

September 12, 2020 at 12:35 pm

ప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్‌ స్వామికి మాతృ వియోగం కలిగింది. నిన్న రాత్రి 10 గంటలకు చినజీయర్‌ మాతృమూర్తి అలివేలుమంగ పరమపదించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అలివేలుమంగ ‍అంత్యక్రియలు జరగనున్నాయి. హైదరాబాద్‌ శంషాబాద్‌ ముచ్చింతల్‌లో చినజీయర్‌ ఆశ్రమం సమీపంలో అంతిమసంస్కారాలు నిర్వహించనున్నారు.భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి… అహోబిల రామానుజ స్వామి గత వారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన ఆయనకు అర్చకులు, పండితులు ఘన స్వాగతం పలికారు.

ప్రధానఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చినజీయర్‌ స్వామి…. అభయాంజనేయ స్వామి, లక్ష్మీ తయారు అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. 60 రోజుల పాటు చాతుర్మాస్య వ్రతం పూర్తిచేసుకుని భద్రాద్రి రామయ్య సన్నిధికి వచ్చినట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. వచ్చే ఆశ్వాయుజ మాసం నుంచి కార్తీక మాసం వరకు 30 రోజులపాటు ప్రత్యేక రామ క్రతువు కోసం రామయ్య ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది చివరి వరకు కరోనా ఉంటుందని చినజీయర్​ స్వామిజీ చెప్పారు.

విషాదంలో చిన్న జీయర్ స్వామి …… శోక సంద్రంలో పీఠం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts