ప్ర‌ధాని మోదీ బ‌ర్త్‌డే.. చిరు, ప‌వ‌న్‌ స్పెష‌ల్‌ విషెస్!

September 17, 2020 at 10:55 am

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ 70వ పుట్టిన‌రోజు నేడు. అయితే ఎప్పుడూ మోదీ తన పుట్టినరోజును ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండా అత్యంత సాధారణంగా జరుపుకుంటారు. అమ్మ వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం లేదా సాధారణ ప్రజానీకంతో గడపడం చేస్తుంటారు మోదీ. ఇదిలా ఉంటే.. మోదీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆయనకు దేశ, విదేశాల్లోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా మోదీకి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మ‌రియు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ‌దైన శైలిలో మెదీకి విష్ చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా.. `మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి 70 వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఈ దేశాన్ని మీరు అదే శక్తితో మరెన్నో సంవత్సరాలు పాలించాలని కోరుకుంటున్నా” అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

`భారత ప్రధాని నరేంద్ర మోదీకి మా నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే ‘మన భారత దేశం బాగుపడాలంటే, దేశదేశాల్లో మన భారత దేశం గురించి చెప్పుకోవాలంటే, మోదీ గారే జీవితాంతము భారత ప్రధానిగా ఉండాలి. అప్పుడే మన భారతదేశం బాగుపడుతుంది. మన భరతమాత బిడ్డ ప్రధాని మోదీ గారు వంద సంవత్సరములు ఆయురారోగ్యములతో క్షేమంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను’ అని మంచు మోహన్ బాబు విషెస్ తెలిపారు.

ప్ర‌ధాని మోదీ బ‌ర్త్‌డే.. చిరు, ప‌వ‌న్‌ స్పెష‌ల్‌ విషెస్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts