చిరు ప్లాన్ వర్కౌట్ అయ్యినట్టేగా ….!

September 16, 2020 at 8:48 am

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఇటీవ‌ల గుండ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి.. అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెల‌సిందే. గుండుతో, మీసాలు లేకుండా.. ఒక స్టైలిష్‌ కళ్లజోడు పెట్టుకొని ఉన్న ఫోటోను చిరు సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేయ‌డంతో.. అది తెగ వైర‌ల్ అయింది. చిరును ఆ లుక్‌లో చూసిన అభిమానులతో పాటు రామ్‌ చరణ్‌ ​కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. పలువురు చిరు న్యూలుక్‌ సూపర్‌ అంటూ స్పందించారు.

అయితే ఇది నిజ‌మైన గుండు కాద‌ని.. తమ టెక్నీషియన్స్ ఇలా తయారు చేశారని తెలుపుతూ ఆ వీడియోను అందరి ముందుంచారు మెగాస్టార్. ఇదిలా ఉంటే.. చిరు గుండు లుక్ తమిళ్ సూపర్ హిట్ వేదాళం రీమేక్ కోస‌మే అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. తెలుగులో ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు.

అయితే ఆ చిత్రం మొదలు పెట్టడానికి చాలా సమయం ఉంది కదా ఇప్పుడే ఎందుకు వదిలారు అన్నది ఆరా తీయ‌గా.. ఫ్యాన్స్ తమ హీరోకు సంబంధించి లుక్స్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడ‌ర‌న్న సంగ‌తి తెలిసిందే. బహుశా అందుకు తగ్గట్టుగా వారి స్పందన ఎలా ఉంటుంది అన్న దానికి చిరు ఇలా చిన్న టెస్ట్ పెట్టారేమో అన్న టాక్ న‌డ‌స్తోంది. ఇక గుండు లుక్‌కు మంచి స్పంద‌న రావ‌డంతో.. చిరు ప్లాన్ వ‌ర్కోట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

చిరు ప్లాన్ వర్కౌట్ అయ్యినట్టేగా ….!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts