సీఎం జగన్ ను అబ్దుల్ కలాం తో పోల్చిన టీడీపీ నేత.. ఎందుకంటే..?

September 20, 2020 at 3:28 pm

టీటీడీ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. డిక్లరేషన్ కు సంబంధించి పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు. తాజాగా దీనిపై స్పందించిన మాజీ మంత్రి అమర్నాథరెడ్డి.. జగన్ సర్కార్ పై విమర్శలు చేశారు. దేవుడి పై ఉన్న నమ్మకంతో అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి డిక్లరేషన్ చేశారు అంటూ తెలిపిన అమర్నాథ్ రెడ్డి.. అబ్దుల్ కలాం కంటే జగన్ ఏమైనా గొప్పవాడా అంటూ ప్రశ్నించారు.

టిటిడి సొమ్మును ప్రభుత్వానికి అప్ప చెప్పేందుకు బోర్డు ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరించారు ఆయన. అలా అప్ప చెప్పాల్సి వస్తే టీటీడీ చైర్మన్ సహా సభ్యులందరూ రాజీనామా చేసి పోవాలి అంటూ విమర్శించారు. వరుసగా రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు జరగడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందంటూ ఆరోపించిన అమర్నాథరెడ్డి… ఇలాంటి దాడుల కారణంగా టీడీపీని దెబ్బ కొట్టి మరో పార్టీని తెరమీదకు తీసుకు వచ్చేందుకు రహస్య వ్యూహాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోంది అంటూ విమర్శించారు.

సీఎం జగన్ ను అబ్దుల్ కలాం తో పోల్చిన టీడీపీ నేత.. ఎందుకంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts