అభివృద్ధిపై జగన్ స్పెషల్ ఫోకస్…పోర్టులు మొదలయ్యేది అప్పుడే…

September 17, 2020 at 4:41 pm

ఏపీలో వరుస పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్..ఇక అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండనుందో అనే విషయాన్ని ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను సమర్థవంతంగా నిర్వహించుటకు ప్రత్యేక ‘టాస్క్ ఫోర్స్’ను, సమగ్ర పరిశ్రమల సర్వే ద్వారా పరిశ్రమలన్నింటిని తనిఖీ చేసి కావాలసిన వసతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాఖలో ఐటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి, ‘పెట్రో కెమికల్ కారిడార్‌లో భాగంగా రెండు కెమికల్ సోలార్ మానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌లను ఏపీలో ఏర్పాటు కానున్నాయని అన్నారు.

భావనపాడు, రామాయపట్నం పోర్టులను డిసెంబర్ 15 నాటికి పనులు ప్రారంభిస్తామని, వరల్డ్ క్లౌడ్ సెంటర్‌ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. డిసెంబర్ నుండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించనున్నామని, బల్క్ డ్రగ్ పార్క్‌ని ఏపీకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జగన్ ప్రవేశపెట్టిన నాడు-నేడు కార్యక్రమాన్ని నీతి ఆయోగ్ అభినందించిందని, 8 షిప్పింగు హార్బర్‌లకు ఆర్థిక సాయానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. బీహెచ్‌ఈఎల్ ద్వారా రాష్ట్రంలో సోలార్ మానుఫ్యాక్చురింగు యూనిట్  వచ్చే అవకాశం ఉందని వివరించారు.

అభివృద్ధిపై జగన్ స్పెషల్ ఫోకస్…పోర్టులు మొదలయ్యేది అప్పుడే…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts