ఎస్పీ బాలు కుమారుడితో ఫోన్ లో మాట్లాడిన సీఎం జగన్

September 25, 2020 at 4:53 pm

ఎన్నటికీ తరగని గానామృతాన్ని అభిమానులకు పంచిన మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బాలు మృతి పట్ల సీఎం జగన్ ఇంతకుముందు ట్విట్టర్ లో తన సంతాపం తెలియజేశారు. తాజాగా ఆయన బాలు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడారు.

బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ను సీఎం జగన్ పరామర్శించారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. కళా, సాంస్కృతిక రంగానికి ఆయన మరణం తీరని లోటు అని సీఎం జగన్ పేర్కొన్నారు. తరగని ప్రతిభ ఆయన సొంతం అని కొనియాడారు. తన గాన మాధుర్యంతో కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించారని తెలిపారు.

ఎస్పీ బాలు కుమారుడితో ఫోన్ లో మాట్లాడిన సీఎం జగన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts