తిరుమలలో జగన్ పర్యటన..చిత్తూరులో ఉద్రిక్తత…

September 23, 2020 at 11:01 am

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం జగన్ తిరుపతికి వెళ్లనున్నారు. అయితే టీటీడీ డిక్లరేషన్ ఇష్యూపై గత కొన్నిరోజులుగా ప్రతిపక్షాలు నానా హంగామా చేస్తున్న విషయం తెలిసిందే, ఈ క్రమంలోనే నేడు తిరుమలకు జగన్ వస్తున్న నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతలు ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో జగన్ పర్యటనను అడ్డుకుంటారనే ప్రచారంతో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. టీటీడీ పరిపాలన భవనం ముందు ఈ రోజు నిరసనకు టీడీపీ  పిలుపునిచ్చింది. ఇందుకోసం చిత్తూరు జిల్లా నుంచి టీడీపీ ముఖ్యనేతలు తిరుపతికి రావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హౌస్ అరెస్టుల పర్వం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే చిత్తూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, పుంగనూరులో శ్రీనాథ్ రెడ్డి, అనూష రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుమలలో జగన్ పర్యటన..చిత్తూరులో ఉద్రిక్తత…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts