సీఎం జగన్ మరో సారి మనసు దోచేశారు..!

September 2, 2020 at 3:53 pm

కడప జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాన్వాయ్ ఓ అంబులెన్స్ కు దారి ఇచ్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తుండగా గూడవల్లి-నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించాల్సి రావటంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ కొద్దిగా వేగం తగ్గించుకుని ఆంబులెన్స్ కు దారి ఇచ్చింది.

ఉయ్యూరు నుంచి బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తి గన్నవరం వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఆయన్ను జాతీయ రహదారుల సంస్థకు చెందిన ఆంబులెన్స్ లో విజయవాడలోని ఈఎస్ఐ అస్పత్రికి తరలించారు. అదే సమయంలో సీఎం కాన్వాయ్ వెళ్తుండటంతో ముందుగా ఆంబులెన్స్ కు దారి ఇవ్వాలని సీఎం సూచన మేరకు కాన్వాయ్​ను పక్కకు తొలగించారు. సరిగ్గా ఇలాంటి ఘటన జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా చోటు చేసుకుంది. అప్పుడు కూడా జగన్ ఇలానే ఆంబులెన్స్ కి దారిని ఇచ్చి పంపించారు.

సీఎం జగన్ మరో సారి మనసు దోచేశారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts