భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క ఆదేశాలు

September 26, 2020 at 2:02 pm

తెలంగాణ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అల్ప‌ద్రోణి ప్ర‌భావంతో రాష్ట్ర‌వ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. ప‌లు చోట్ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ప‌ట్ట‌ణాల్లోని లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద‌నీరు భారీగా చేరుతున్న‌ది. ఇప్ప‌టికే సాధార‌ణ వ‌ర్ష‌పాతాన్ని మించి తెలంగాణ‌లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైద‌రాబాద్ ట్యాంక్ బండ్‌లోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుతున్న‌ది. ఇప్ప‌టికే ఫుల్ ట్యాంక్ సామ‌ర్థ్యాన్ని చేరుకున్న‌ది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వ‌ర‌ద నీటిని ఎప్ప‌టిక‌ప్పుడు దిగువ‌కు వ‌దిలేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా లోత‌ట్టు కాల‌నీల్లోని సుర‌క్షిత ప్రాంతాల‌ను త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌లు కీల‌క ఆదేశాల‌ను జారీ చేశారు. రాష్ట్రంలోని వ‌ర్షాల ప్ర‌స్తుత ప‌రిస్థితిని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేష్‌కుమార్‌ను అడిగి ప‌రిస్థితిని తెలుసుకున్నారు. వ‌ర‌ద‌లు త‌దిత‌ర అంశాల‌పై దిశానిర్దేశం చేశారు. వ‌ర‌ద‌ల‌తో ఆస్తి న‌ష్టం, ప్రాణ‌న‌ష్టం వాటిల్ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని సూచించారు. అదేవిధంగా అధికారుల‌కు మూడు నాలుగు రోజుల పాటు సెల‌వుల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోనే ఉంటూ పరిస్థితులు తెలుసుకొని సమాచారం ఇచ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు.

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క ఆదేశాలు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts