న‌రేంద్ర మోదీ నీకు చేతులెత్తి దండం పెడుతున్నా: కేసీఆర్‌

September 15, 2020 at 2:07 pm

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీజేపీ ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలీలో విరుచుకుప‌డ్డారు. విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లును ఉప‌సంహ‌రించుకుకోవాల‌ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం సాగిన స‌మావేశాల్లో కేంద్రం ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన 2003 విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లుపై స‌భ్యులు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల హ‌క్కుల‌న కాల‌రాస్తున్న‌ది మండిప‌డ్డారు. కేంద్రం ప్ర‌తిపాదించిన విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లు అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని వివ‌రించారు. వేలాది మంది ఉద్యోగుల జీవితాలు రోడ్డున ప‌డే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు. వ్య‌వ‌సాయ మోట‌ర్ల‌కు మీట‌ర్ల‌ను పెట్టాల‌ని చూస్తున్న‌ది. దీంతో రైతుల న‌ష్ట‌పోయే అవ‌కాశ‌ముంద‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ‌కు చెందిన బీజేపీ ఎంపీలు ఈ బిల్లుకు ప్ర‌జ‌ల‌కు స‌మాధానాలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. న‌రేంద్ర మోడీ మీకు చేతులెత్తి దండం పెడుతున్న ఇప్ప‌టికైన ఈ బిల్లును ఉప‌సంహ‌రించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

ఇదిలా ఉండగా అనంత‌రం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన ఈ బిల్లును వ్య‌తిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష నేత మ‌ల్లు బ‌ట్టి విక్ర‌మార్క సైతం కేంద్రం ప్ర‌తిపాదించిన బిల్లును వ్య‌తిరేకిస్తూ త‌న మ‌ద్దుత‌ను తెలిపారు. శాస‌నస‌భ స‌భ్యులంద‌రూ 2003 విద్యుత్ చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ ఏక‌గ్రీవంగా ఆమోదించారు. అనంత‌రం అసెంబ్లీ స‌మావేశాన్ని బుధ‌వారం ఉద‌యం 10గంట‌ల‌కు స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి వాయిదా వేశారు.

న‌రేంద్ర మోదీ నీకు చేతులెత్తి దండం పెడుతున్నా: కేసీఆర్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts