ఏపీ రైత‌న్న‌ల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌.. బోర్ల‌తో పాటు అవి కూడా ఫ్రీ!

September 28, 2020 at 2:46 pm

క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ ప‌థ‌కాల‌ను నెర‌వేర్చ‌డంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇవేళ మెట్టభూములకు సాగు నీరు అందించేందుకు ఇచ్చిన హామీ మేరకు `వైఎస్సార్‌ జలకళ` పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ స్కీమ్ కింద ప్రభుత్వమే రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించనుంది.

నవరత్నాలు హామీల్లో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు నేడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన‌‌ ‘వైఎస్‌ఆర్‌ జలకళ’ పథకం వ‌ర్తిస్తుంది. ఇదే స‌మ‌యంలో మ‌రో గుడ్ న్యూస్ కూడా చెప్పారు జ‌గ‌న్‌. ఉచితంగా బోర్డు వేయించడంతోపాటు ఉచితంగా మోటార్‌ను సైతం బిగిస్తామని చెప్పారు. ఒక బోరు ఫెయిల్‌ అయితే మరో బోరు వేయిస్తామన్నారు వెల్ల‌డించారు జ‌గ‌న్‌.

కాగా, ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. వైఎస్‌ఆర్‌ జలకళ ప‌థ‌కం కోసం ప్రభుత్వం రూ.2,340 కోట్లు ఖర్చుచేయబోతుంది. బోర్లు అవసరమైన చిన్న, సన్నకారు రైతులు దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ కోరారు. భూగర్భ జలాల లభ్యతపై శాస్త్రీయంగా అంచనా వేస్తామన్నారు. ఏదేమైనా ఈ ప‌థ‌కం అన్నదాతలకు వరంగా మారనుంది.

ఏపీ రైత‌న్న‌ల‌కు మ‌రో గుడ్‌న్యూస్‌.. బోర్ల‌తో పాటు అవి కూడా ఫ్రీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts