జగన్, బాబులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కమ్యూనిస్ట్ నేతలు…

September 26, 2020 at 1:38 pm

ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులపై కమ్యూనిస్ట్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సిగ్గు విడిచి మత రాజకీయాలు చేస్తున్నారని సీపీఎం మధు విమర్శించారు. మోదీ.. కార్పొరేట్‌ రంగానికి దేశ సంపదను దోచిపెడుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా 29, 30, 1 తేదీల్లో నిరసన దీక్షలు’ చేపడుతున్నట్లు మధు తెలిపారు.

అటు కేంద్రంలోని పెద్దలకు సీఎం జగన్‌ వంగి వంగి దండాలు పెడుతున్నారని సీపీఐ రామకృష్ణ విమర్శించారు. ‘రూ.4 వేల కోట్ల అప్పు కోసం విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారని, విద్యుత్ మీటర్లు బిగించిన రోజు నుంచే జగన్‌ రాజకీయ పతనం మొదలవుతుందని, టీడీపీ ఎంపీలు ఇక్కడ ఒకలా, పార్లమెంట్‌లో మరోలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ ఇల్లు తగులబెట్టి బొగ్గులు ఎరుకునే ప్రయత్నం చేస్తోందని రామకృష్ణ ఆరోపించారు.

జగన్, బాబులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కమ్యూనిస్ట్ నేతలు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts