ఉద్రిక్తంగా కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి..

September 28, 2020 at 3:25 pm

కొత్త వ్యవసాయ చట్టం అమలు వద్దంటూ రాజ్ భవన్ దగ్గర ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ…గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో ఓ అధికారిని బయటకు పంపాలని నేతలు కోరగా…మెయిలో పంపాలని సూచించారు అధికారులు. దీంతో పక్కనే ఉన్న దిల్ కుషా గెస్ట్ హౌజ్ లో సమావేశమయ్యారు నేతలు. అయితే అనుమతి లేకపోవడంతో నేతలను వెళ్లాలని సూచించినా…బయటకు వెళ్లకపోవడంతో నేతలను బలవంతంగా ఆరెస్ట్ చేశారు పోలీసులు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతులను కేసీఆర్, మోడీ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పార్లమెంట్ లో అప్రజాస్వామికంగా మూడు బిల్లులను పాస్ చేయించారని మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులతో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులను చీకట్లో నెట్టిన చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే…అడ్డుకోవడం అన్యాయమన్నారు ఉత్తమ్.

ఉద్రిక్తంగా కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts