కరోనా : అసెంబ్లీ సమావేశాలు కుదింపు.. ప్రతిపక్షాలు ఏమైనా ఉన్నాయో తెలుసా..?

September 15, 2020 at 4:47 pm

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో కీలక బిల్లులపై ఆమోదముద్ర వేయించుకుంది. అంతేకాకుండా ప్రతిపక్షం అధికార పక్షం మధ్య ప్రశ్నోత్తరాలు కూడా వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ వర్షాకాల శాసనసభ సమావేశాలు కుదించే సంకేతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇటీవలే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సహాయక సిబ్బంది కూడా కరోనా వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో… ప్రభుత్వం దీనిపై చర్చ జరిపింది. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తో శాసనసభ సభ్యులు అందరితో సమావేశమయ్యారు. రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సమావేశాలను రేపటితో ముగించాలని రాష్ట్రప్రభుత్వం స్పీకర్ ముందుకు ప్రతిపాదన తీసుకు రాగా… కృష్ణా జలాలు సహా మరికొన్ని అంశాలపై కీలక చర్చలు జరగాల్సి ఉందని అందుకే మరి కొన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని అంటూ స్పీకర్ ను డిమాండ్ చేసాయి ప్రతిపక్ష పార్టీలు.

కరోనా : అసెంబ్లీ సమావేశాలు కుదింపు.. ప్రతిపక్షాలు ఏమైనా ఉన్నాయో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts