క‌రోనా టెస్టుల్లో ఏపీ కొత్త‌ రికార్డ్‌!

September 20, 2020 at 9:28 am

ప్ర‌పంచ‌దేశాల్లోనూ క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంత‌క వైర‌స్ అటు ప్ర‌జ‌ల‌ను, ఇటు ప్ర‌భుత్వాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతోంది. కంటికి క‌నిపించ‌ని ఈ క‌రోనాను అదుపు చేసే వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఏపీలోనూ క‌రోనా కేసులు ఊహించ‌ని రీతిలో పెరుగుతున్నాయి.

అయితే కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ స‌రికొత్త రికార్డును క్రియేట్ చేసింది. శనివారం నాటి పరీక్షలతో రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 50,33,676కు చేరింది. దీంతో క‌రోనా పరీక్షల సంఖ్య 50లక్షలు దాటిన రాష్ట్రంగా ఏపీ కొత్త రికార్డు సృష్టించింది. మ‌రోవైపు రికవరీ రేటులోనూ ఏపీ దూసుకుపోతోంది. 85.91 శాతం రికవరీతో ఏపీ.. దేశంలోనే నాలుగవ స్థానంలో నిలిచింది.

కాగా, రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,17,776కి చేరింది. అయితే అందులో 5,30,711 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వ‌గా.. 81,763 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఏపీలో ఇప్ప‌టికే వ‌ర‌కు క‌రోనా ధాటికి 5302 మంది ప్రాణాలు విడిచారు.

క‌రోనా టెస్టుల్లో ఏపీ కొత్త‌ రికార్డ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts