న‌లుగురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చిన కరోనా బాధితురాలు.. ఎక్క‌డంటే?

September 25, 2020 at 12:25 pm

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. ముఖ్యంగా చిన్న‌పిల్లలకి, ముస‌లివారికి, గ‌ర్భిణీలకి సులువు‌గా క‌రోనా సోకేస్తుంది. అయితే తాజాగా ఓ క‌రోనా బాధితురాలు ఒకే కాన్పులో న‌లుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లో చోటుచేసుకుంది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. దేవరియా జిల్లాలోని గౌరీ బజార్​లో నివసిస్తున్న 26 ఏళ్ల మహిళ మంగళవారం రాత్రి మెడికల్ కాలేజీలోని ట్రామా సెంటర్​కు చేరుకుని కరోనా టెస్టు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. అయితే అత్యంత సమర్థమైన వైద్యులు, పారామెడికల్​ టీమ్ వైద్యం అందించగా.. ఆమె బుధవారం నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.

ఇక‌ నవజాత శిశువుల్లో ముగ్గురు ఆరోగ్యంగా ఉన్నారని, నాలుగో చిన్నారిని వెంటిలేటర్​పై ఉంచినట్లు వివరించారు. తల్లి కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే నలుగురు చిన్నారులు 980 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు ఉన్నట్లు వివ‌రించారు. ప్ర‌స్తుతం న‌లుగురు పిల్ల‌ల‌కు క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హిస్తున్నారు.

న‌లుగురు పిల్లలకు ఒకేసారి జన్మనిచ్చిన కరోనా బాధితురాలు.. ఎక్క‌డంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts