కరోనా మరో ఎంపీ ని బలితీసుకుంది..!

September 17, 2020 at 4:59 pm

దేశంలో కరోనా వైరస్ ఏ రేంజ్ లో విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ రోజురోజుకు శరవేగంగా వ్యాప్తిచెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. కేవలం సామాన్య ప్రజలనే కాదు ఏకంగా సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారినపడి ప్రాణాలు వదులుతున్న ఘటనలు తెర మీదకి వస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు ధైర్యం చెప్పే ప్రజాప్రతినిధుల కరోనా వైరస్ బారినపడి మృతి చెందడంతో ప్రజలలో మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవలే కరోనా వైరస్ మరో పార్లమెంట్ సభ్యుని బలితీసుకుంది. కర్ణాటకకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తే కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ అని నిర్ధారణ కాగా ఈ నెల 2న ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. కాగా ఈయన జులై 22వ తేదీన రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకరం చేశారు. కాగా ఇప్పటికే పలువురు పార్లమెంటు సభ్యులు కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

కరోనా మరో ఎంపీ ని బలితీసుకుంది..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts