కరోనా ను జయించి.. ధైర్యం నింపుతున్న బామ్మ..!

September 20, 2020 at 3:36 pm

దేశంలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే సమయంలో రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉండడం ప్రజలందరిలో ధైర్యం నింపుతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో కరోనా వైరస్ బారిన పడిన తర్వాత వృద్ధులు పరిస్థితి క్షీణించి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అని పరిశోధకులు చెప్పినప్పటికీ ప్రస్తుతం భారత్లో మాత్రం వందేళ్లకు పైబడిన వృద్ధులు సైతం కరోనా వైరస్ ను జయించి కోలుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఎంతో మంది వృద్ధులు కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇటీవలే మహారాష్ట్రలో మరో బామ్మ కరోనా వైరస్ జయించింది. థానే కు చెందిన 102 ఏళ్ల ఆనందీబాయి ఇటీవలే కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేసుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయినప్పటికీ అధైర్య పడకుండా కరోనా కేర్ సెంటర్ లో చికిత్స తీసుకుని ఇటీవలే డిశ్చార్జ్ అయ్యింది ఈ వృద్ధురాలు. దీంతో ఆ వృద్ధురాలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక 102 ఏళ్ల బామ్మ కరోనా వైరస్ బారిన పడడంతో ఆందోళనలో మునిగిపోయిన కుటుంబీకులు.. ఇప్పుడు బామ్మ కోల్పోవడంతో ప్రస్తుతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా ను జయించి.. ధైర్యం నింపుతున్న బామ్మ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts