క‌రోనా రోగుల‌కు డెంగీ.. వైద్యు‌లకు కొత్త టెన్ష‌న్‌?

September 26, 2020 at 8:24 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను కంటి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే కరోనా ఓ వైపు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే.. మరోవైపు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ దోమలు పెరిగిపోతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా ఉన్నవారిని కొత్తగా డెంగీ కూడా చుట్టుముడుతోంది. కరోనా చికిత్సకు ఏ మందు వాడాలో స్పష్టత లేక నానా తిప్ప‌లు ప‌డుతుంటే.. ఇప్పుడు డబుల్ ఇన్ఫెక్షన్‌ కొత్త సవాల్‌ విసురుతోంది. ఒకేసారి క‌రోనా మ‌రియు డెంగీ సోకితే.. రెండు ఆరోగ్య సమస్యలకు ఏ చికిత్స అందించాలో తెలియక వైద్యులు తల పట్టుకుంటున్నారు.

దీనిపై దేశవ్యాప్తంగా వైద్యవర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ప్ర‌స్తుతం రక్త గడ్డకట్టకుండా ఉండేందుకు పలువురు క‌రోనా రోగులకు హెపారిన్ మందును ఇస్తుంటారు. అయితే డబుల్‌ ఇన్ఫెక్షన్‌ బారినపడినవారికి హెపారిన్‌ను అందించి.. వెంటనే డెంగీ చికిత్సలో భాగంగా రక్తంలోకి ప్లేట్‌లెట్లు ఎక్కిస్తే తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందుకే రెండు ఆరోగ్య సమస్యలకు ఏకకాలంలో ఔషధాలు అందించడంలో సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉంటుందని హెచ్చ‌రిస్తున్నారు.

క‌రోనా రోగుల‌కు డెంగీ.. వైద్యు‌లకు కొత్త టెన్ష‌న్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts