ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్

September 28, 2020 at 4:31 pm

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొద్దీ మేర తగ్గిన రోజుకు వేల సంఖ్యలోనే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులను ఎవరిని కూడా వదలకుండా ఈ కరోనా వైరస్ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇక ఇప్పటికే పలు రాజకీయ నాయకులు, అలాగే సినీ ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడిన సంగతి అందరికి విదితమే. ఇక తాజాగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ఇక ఈయన తాజాగా సీఎం జగన్ తో పాటు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరు అవ్వడం జరిగింది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల్లో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఇక తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో సీఎం జగన్ వెంట ఈ ఇద్దరు మంత్రులుకూడా ఉన్నారు. ఇక మంత్రి హోం ఐసోలేషన్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా…? లేదా ఏదైనా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారన్న..? విషయం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు.

ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts