కరోనాపై కేంద్రం కొత్త సూచనలు.. ఏమిటో తెలుసా..

September 14, 2020 at 7:49 am

కరోనా బాధితుల‌కు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కీల‌క సూచ‌న‌లు చేసింది. ఆరోగ్య ర‌క్ష‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై జాగ్ర‌త్త‌ల‌ను కీల‌క సూచ‌న‌ల‌ను చేసింది. వైరస్‌ బారినపడి కోలుకున్నవారు పూర్తిగా ఆరోగ్యం సంతరించుకొనేందుకు యోగాసనాలు వేయాలని దిశానిర్దేశ‌నం చేసింది. ప్ర‌తీరోజూ ఉదయం, సాయంత్రం యోగాసనాలు వేస్తూ ప్రాణాయామం, మెడిటేషన్‌ చేస్తూ ఛావన్‌ప్రాశ్‌ తింటే త్వరగా కోలుకుంటారని నూతన మార్గదర్శకాల్లో వివరిండం విశేషం.

అంతకుముందే అనారోగ్యంతో ఉన్నవారు, కరోనాతో తీవ్రంగా ఇబ్బందిపడినవారు నెగెటివ్‌ వచ్చిన తర్వాత కోలుకోవటానికి చాలా సమయం పడుతుంద‌ని, అందువల్ల యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్‌ చేస్తూ శ్వాసకు సంబంధించిన కసరత్తులు చేయాల‌ని. ఇందుకోసం ఫిజియన్‌ సలహా తీసుకోవాల‌ని అని వివ‌రించింది. కేంద్రం గ‌తంలో కొవిడ్ బాధితుల కోసం కీల‌క సూచ‌న‌లు ఇస్తూ వ‌చ్చింది.

కరోనాపై కేంద్రం కొత్త సూచనలు.. ఏమిటో తెలుసా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts