భార‌త్‌లో క‌రోనా విళ‌యం.. 50 ల‌క్ష‌లు దాటిన పాజిటివ్ కేసులు!

September 16, 2020 at 10:29 am

చైనాలోని వూహాన్ న‌గంలో పురుడుపోసుకున్న క‌రోనా వైర‌స్.. ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా భార‌త్‌లో క‌రోనా జోరు మ‌రింత వేగంగా మారింది.

ప్ర‌స్తుతం భార‌త్‌లో క‌రోనా కేసులు 50 ల‌క్ష‌లు దాటేసింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో ఏకంగా 90,123 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 50,20,360 కు చేరింది. అలాగే నిన్న ఒక్క‌రోజే 1,290 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 82,066 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 39,42,361 మంది కోలుకోగా.. 9,95,933 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్న ఒక్కరోజులోనే 11,16,842 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం క‌రోనా టెస్ట్‌ల సంఖ్య‌ 5,94,29,115కు చేరుకుంది.

భార‌త్‌లో క‌రోనా విళ‌యం.. 50 ల‌క్ష‌లు దాటిన పాజిటివ్ కేసులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts