భార‌త్‌లో క‌రోనా టెర్ర‌ర్‌.. నిన్న ఎన్ని కేసులో తెలుసా?

September 29, 2020 at 10:08 am

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు క‌రోనా పేరు వింటేనే భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇక దేశా‌ల‌న్నీ అన్‌లాక్ ప్ర‌క్రియ స్టాట్ చేశాక‌ క‌రోనా వైర‌స్ మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా భార‌త్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది.

ప్ర‌స్తుతం భార‌త్‌లో క‌రోనా కేసుల సంఖ్య 61 ల‌క్ష‌లు దాటింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో ఏకంగా 70,589 మందికి కొత్తగా కరోనా సోకింది. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 61,45,292 కు చేరింది. అలాగే నిన్న ఒక్క‌రోజే 776 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

తాజా ల‌క్క‌ల‌తో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 96,318కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 51,01,398 మంది కోలుకోగా.. 9,47,576 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇక క‌రోనా కేసుల‌తో పాటు రిక‌వ‌రీ రేటు కూడా భారీగా పెర‌గ‌డం ఊర‌ట‌నిచ్చే అంశం. కాగా, దేశంలో నిన్న ఒక్కరోజులోనే 11,42,811 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం క‌రోనా టెస్ట్‌ల సంఖ్య 7,31,10,041 కు చేరుకుంది.

భార‌త్‌లో క‌రోనా టెర్ర‌ర్‌.. నిన్న ఎన్ని కేసులో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts