తెలంగాణలో త‌గ్గుతున్న క‌రోనా.. తాజాగా ఎన్ని కేసులంటే?

September 14, 2020 at 10:39 am

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా.. ఎప్పుడు అంతం అర్థంకావ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1417 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 1,58,513 కు చేరింది. ఇక నిన్న 13 మంది క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 974 కి పెరిగిందని వెల్లడించింది.

అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 2479 గా నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1,27,007 కు చేరుకుంది. తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 30532 ఉన్నాయి. వీటిలో 23639 మంది ప్రజలు ఇళ్లలోనే ఉంటూ చికిత్స‌ పొందుతున్నారు.అలాగే రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 21,69,339 క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన‌ట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

తెలంగాణలో త‌గ్గుతున్న క‌రోనా.. తాజాగా ఎన్ని కేసులంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts