తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. అదొక్క‌టే ఊరిట‌!

September 15, 2020 at 9:26 am

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా.. ఎప్పుడు అంతం అర్థంకావ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో నిన్న త‌గ్గిన క‌రోనా కేసులు ఈరోజు మ‌ళ్లీ పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,058 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 1,60,571 కు చేరింది. ఇక నిన్న 10 మంది క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 984 కి పెరిగిందని వెల్లడించింది.

అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 2,180 గా నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1,29,187 కు చేరుకుంది. పాజిటివ్ కేసుల కంటే రిక‌వ‌రీ రేటు ఎక్కువ ఉండ‌టం కాస్త ఊర‌ట‌నిచ్చే అంతం. తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 30,400 ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 22,20,586 క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన‌ట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు.. అదొక్క‌టే ఊరిట‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts