తెలంగాణ‌లో క‌రోనా జోరు.. వెయ్యి దాటిన మ‌ర‌ణాలు!

September 17, 2020 at 9:54 am

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా.. ఎప్పుడు అంతం అర్థంకావ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్‌ క‌ల‌వ‌ర పెడుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,159 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 1,65,003 కు చేరింది. ఇక నిన్న 9 మంది క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,005 కి పెరిగిందని వెల్లడించింది.

అలాగే కొత్తగా 2180 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1,33,555 కు చేరుకుంది. దీంతో ప్ర‌స్తుతం తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 30,443 ఉన్నాయి. అయితే వారిలో 23,674 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

తెలంగాణ‌లో క‌రోనా జోరు.. వెయ్యి దాటిన మ‌ర‌ణాలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts