తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు.. కానీ, అదొక్క‌టే బిగ్ రిలీఫ్‌!

September 19, 2020 at 9:20 am

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా.. ఎప్పుడు అంతం అర్థంకావ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,123 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 1,69,169 కు చేరింది. ఇక నిన్న 9 మంది క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1025 కి పెరిగిందని వెల్లడించింది.

అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 2,151 గా నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1,37,508 కు చేరుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 30,636 ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 24,34,409 క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన‌ట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కాగా, తెలంగాణలో రికవరీల సంఖ్య భారీగా పెరిగాయి. దేశ రికవరీ రేటు 79.26గా ఉండగా.. తెలంగాణ మాత్రం రికవరీ రేటు 81.28 ఉండ‌టం బిగ్ రిలీఫ్ ఇస్తోంది.

తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు.. కానీ, అదొక్క‌టే బిగ్ రిలీఫ్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts