తెలంగాణ‌లో కాస్త త‌గ్గిన క‌రోనా.. కొత్త‌గా ఎన్ని కేసులంటే?

September 21, 2020 at 10:32 am

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో పుట్టుకొచ్చిన ప్రాణాంత‌క వైర‌స్ క‌రోనా.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసింది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా.. ఎప్పుడు అంతం అర్థంకావ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో క‌రోనా కేసులు నిన్న కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,302 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 1,72,608 కు చేరింది. ఇక నిన్న 9 మంది క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,042 కి పెరిగిందని వెల్లడించింది.

అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 2,230గా నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 1,41,930 కు చేరుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 29,636 ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 2519315 క‌రోనా టెస్టులు నిర్వ‌హించిన‌ట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. కాగా, గ‌త 24 గంట‌ల్లో 31095 పరీక్షలు నిర్వహించారు.

తెలంగాణ‌లో కాస్త త‌గ్గిన క‌రోనా.. కొత్త‌గా ఎన్ని కేసులంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts