యూఏఈకి వచ్చేసిన కరోనా వ్యాక్సిన్.. ఆరోగ్య మంత్రికే తొలి డోస్‌!

September 20, 2020 at 11:33 am

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌కు పాకేసి.. ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందులు పెడుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ను మ‌ట్టుపెట్ట‌లేమ‌ని తేల‌డంతో.. ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా విరుగుడు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకముందే, ప్రజలకు పంపిణీ చేస్తున్న తొలి దేశంగా రష్యా నిలువగా.. ఇప్పుడు యూఏఈ సైతం అదే చేసింది. ఇటీవల వ్యాక్సిన్ ను కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ యోధులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. తొలి విడత వ్యాక్సిన్ డోస్ దేశంలోకి అందుబాటులోకి వచ్చింది.

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. త‌మ వ్యాక్సిన్‌ ట్రయల్స్ లో ఎలాంటి దుష్పరిణామాలూ సంబవించలేదని చెప్ప‌డానికి.. యూఏఈ ఆరోగ్య శాఖా మంత్రి అబ్దుల్ రహ్మాన్ బిన్ మొహమ్మద్ అల్ ఓవైస్ తొలి డోస్ ను తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా దేశ ప్రజలను రక్షించడంలో తాము ముందుంటామని ఆయ‌న చెప్పుకొచ్చారు.

యూఏఈకి వచ్చేసిన కరోనా వ్యాక్సిన్.. ఆరోగ్య మంత్రికే తొలి డోస్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts