గాంధీ వేషంలో కొవిడ్ టెస్ట్‌కు..

September 30, 2020 at 6:32 pm

కొవిడ్ 19 మ‌హ‌మ్మారి మాన‌వాళిలో సృష్టించిన భ‌యం అంతా ఇంత కాదు. క‌నీసం ప‌రీక్ష చేయించుకునేందుకు కూడా వైద్య‌శాల‌ల‌కు వెళ్లాలంటే కొంద‌రు జంకుతున్నారు. ప్రాణం మీద‌కు వ‌స్తే త‌ప్ప ఇక ఎలాంటి రోగం వ‌చ్చినా హాస్పిట‌ల్ గ‌డ‌ప తొక్క‌డం లేదు. అదీగాక కొవిడ్ బారిన ప‌డ‌డ‌మంటే మ‌రికొందరు అవమానకరంగానూ భావిస్తున్నారు. ప్ర‌జ‌ల్లోని అపోహ‌ల‌ను తొల‌గించేందుకు, వారిని చైత‌న్య‌వంతం చేసేందుకు ఓ బాలుడు వినూత్న త‌ర‌హా లో కార్య‌క్ర‌మానికి చేప‌ట్టాడు. ఏకంగా మహాత్మాగాంధీ వేషధారణలో కొవిడ్ సెంట‌ర్‌కు వెళ్లి ‌కరోనా పరీక్షలు చేయించుకోవ‌డం విశేషం. గాంధీ జయంతికి రెండు రోజుల ముందుగా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడిపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌కు చెందిన పదేళ్ల బాలుడు గాంధీ మహాత్ముడిలా వేష‌ధార‌ణ వేసుకున్నాడు. కళ్లజోడు పెట్టుకుని, తెల్లని బట్టలు ధరించి కొవిడ్ సెంట‌ర్‌కు వెళ్లాడు. కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకున్నాడు. ఈ సంద‌ర్భంగా అక్కడున్నవారంతా బాలుడి వేష‌ధార‌ణ‌కు ముగ్ఘులై అత‌న‌ని ఫొటోలు తీశారు. కొంద‌రు ముచ్చ‌టప‌డి బాలుడితో క‌లిసి ఫొటోలు ఫోజులిచ్చారు. కొవిడ్‌ పరీక్షలంటే ప్రజల్లో భయం పోగొట్టేందుకే గాంధీ వేషధారణలో వచ్చానని ఆ బాలుడు ఈ సంద‌ర్భంగా వారితో తెలిపారు. అందరూ సహకరిస్తేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అని వివ‌రించాడు.

గాంధీ వేషంలో కొవిడ్ టెస్ట్‌కు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts