రాష్ట్రాన్ని డీజీపీకి అప్పగిస్తే పరిపాలన చేస్తారు…

September 2, 2020 at 3:52 pm

ఏపీలో ప్రతిపక్ష నేతల ఉత్తరాలు రాస్తే మిమ్మలనే విచారణకు పిలుస్తాం అన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని సి‌పి‌ఐ రామకృష్ణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుపుతుందా? లేక జగన్ ఏకపక్ష రాజ్యం నడుస్తుందో ఆర్థం కావడం లేదని అన్నారు.

మాస్క్‌లు, పీపీఈ కిట్స్ లేవని డాక్టర్ సుధాకర్ చెబితే ఆయనపై పోలీసులతో దాడి చేయించడమే కాకుండా ఆయనను పిచ్చివాడిగా ముద్ర వేశారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉందా ? లేదా పోలీస్ ప్రభుత్వం ఉందా ? ముఖ్యమంత్రి జగన్ కూడా పోలీస్ డ్రస్ వేసుకుని పాలన చేస్తే సరిపోతుందని, లేకపోతే జగన్ ఇడుపులపాయలో కుర్చుని రాష్ట్రాన్ని డీజీపీకి అప్పగిస్తే ఆయన పరిపాలన చేస్తారని అన్నారు.

ప్రతిపక్ష నేతకు పోలీసులు నోటీలు ఇచ్చారంటే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని అర్థమైపోతుందని, చంద్రబాబుకు మదనపల్లి డీఎస్పీ నోటీసులు పంపడం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు.

రాష్ట్రాన్ని డీజీపీకి అప్పగిస్తే పరిపాలన చేస్తారు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts