ఫ్యాన్స్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్ గుడ్‌న్యూస్‌!

September 30, 2020 at 7:55 am

ఎప్పుడెప్పుడా అని క్రికెట్ ప్రియుడు ఎదురు చూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ ఇటీవ‌ల ప్రారంభ‌మైన సంగ‌తి తెలిందే. అయితే కానీ ప్రతి సంవత్సరం అలరించే ఐపీఎల్ మెరుపులు మాత్రం కనిపించలేదు. ఇదిలా ఉంటే.. తొలి మ్యాచ్ లో గత సంవత్సరపు విజేత ముంబై ఇండియన్స్ పై విజయం సాధించి, అదే ఊపుతో రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్.. 16 పరుగుల తేడాతో పోరాడి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఆ త‌ర్వాత ఢిల్లీ కేపిటల్స్‌తో త‌ల‌ప‌డిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. వ‌రుస ఓట‌మిలపై చెన్నై సూపర్‌ కింగ్స్ అభిమానులు నిరాశ వ్య‌క్తం చేశారు. అయితే ఇలాంటి త‌రుణంలో ఫ్యాన్స్‌కు ధోనీ సేన‌ గుడ్‌న్యూస్ చెప్పింది. చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టులో చేరేందుకు ఇద్దరు కీలక ఆటగాళ్లు సిద్ధమయ్యారు.

స్టార్‌ ప్లేయర్లు ఫిట్‌నెస్‌ సాధించారని చెన్నై ఆడే తర్వాతి పోరులో బరిలో దిగేందుకు రెడీగా ఉన్నారని ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపారు. తొడకండరాల నొప్పి నుంచి రాయుడు కోలుకున్నాడని వెల్లడించారు. తర్వాతి మ్యాచ్‌లో అతడు ఆడతాడని తెలిపాడు. అలాగే చెన్నై ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో గాయం కారణంగా ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. అత‌డు చెన్నై ఆడే త‌ర్వాతి మ్యాచ్‌లో ఆడ‌నున్నాడు.

ఫ్యాన్స్‌కు చెన్నై సూపర్‌ కింగ్స్ గుడ్‌న్యూస్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts