వీడియో కాల్‌లో నగ్నంగా మాట్లాడాడు…అడ్డంగా బుక్ అయ్యాడు…

September 17, 2020 at 9:47 am

ఈ మధ్య సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. కొందరు కేటుగాళ్ళు ఆన్‌లైన్‌లోనే అమాయికులని మోసం చేసేస్తున్నారు. అయితే ఈ మోసాల బారిన పడి కొందరు అడ్డంగా బుక్ అయిపోయి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలా హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఆన్‌లైన్ కేటుగాళ్ల మాయలో పడి దారుణంగా మోస పోయాడు.

ఆ పెళ్లికాని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫోన్‌కు ఏదో ఆన్‌లైన్ డేటింగ్‌కు సంబంధించి ఓ మెసేజ్ వచ్చింది. ఇక డేటింగ్ అని రావడంతో వయసులో మనోడు ఆగలేదు. పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. దీంతో వెంటనే డేటింగ్‌కు సంబంధించిన వివరాలని తెల్సుకోవడానికి ఫోన్ చేశాడు. ఫోన్‌లో ఒక అమ్మాయి మనోడుకు డేట్ ప్యాకేజ్ చెప్పింది. రిజిస్ట్రేషన్ ఫీజ్ కడితే నగ్నంగా ఉన్న అమ్మాయిల పంపుతామని చెబితే, ఆ సాఫ్ట్‌వేర్ కట్టాడు. అలాగే ఫోటోలు వచ్చాయి. నెక్స్ట్ 20 వేలు కడితే అమ్మాయి నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతుందని చెప్పారు.

అలాగే మనోడు డబ్బు కట్టి అమ్మాయితో మాట్లాడాడు. ఆ అమ్మాయే కాకుండా సాఫ్ట్‌వేర్ కూడా నగ్నంగా మాట్లాడాడు. ఇక దీన్నే పట్టుకుని కేటుగాళ్ళు ఉద్యోగిని బెదిరించారు. దీంతో అతన్ని బ్లాక్ మెయిల్ చేసి 2 లక్షల వరకు గుంజారు. చివరికి డబ్బులు ఇవ్వలేను అని చేతులెత్తేయడంతో, ఆ సాఫ్ట్‌వేర్ నగ్నంగా ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో వదిలారు. ఇక ఆ ఉద్యోగికి జ్ఞానోదయం అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఇలాంటి మెసేజ్‌లు,  ఫోన్‌ కాల్స్‌ అంతా మోసమని సైబర్‌ క్రైం పోలీసులు తెలిపారు. అలాగే కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో కాల్‌లో నగ్నంగా మాట్లాడాడు…అడ్డంగా బుక్ అయ్యాడు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts