క‌రోనా బారిన‌ప‌డ్డ దగ్గుబాటి పురందేశ్వరి.. ఎలా సోకిందంటే?

September 30, 2020 at 10:29 am

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ఎటు నుంచి వ‌చ్చి ఎలా ఎటాక్ చేస్తుందో తెలియక ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇక ఈ క‌రోనా భూతాన్ని అంతం చేసే క‌రోనా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాక‌పోవ‌డంతో.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య‌, మ‌ర‌ణాల సంఖ్య ఊహించ‌ని విధంగా పెరిగిపోతుంది.

ఇదిలా ఉంటే.. క‌రోనా బారిన ప‌డుతున్న ప్ర‌జాప్ర‌తినిధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి తాజాగా క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. అనారోగ్యంగా ఉండంటంతో పరీక్షలు చేయించుకోగా ఆమెకు కరోనా సోకినట్టు తేలింది. అయితే సింటమ్స్ కాస్త ఎక్కువగా ఉండడంతో ఆమె హైదరాబాద్‍లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇక‌ తనకు కరోనా సోకిన విషయంపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు. అయితే, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కాసేపటి క్రితమే ఆమో ట్వీట్ చేయడం గమనార్హం. కాగా, ఇటీవలే ఆమెకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. దీంతో పలువురు నేతలు, కార్యకర్తలు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు క‌రోనా సోకుంటుంద‌ని అంటున్నారు.

క‌రోనా బారిన‌ప‌డ్డ దగ్గుబాటి పురందేశ్వరి.. ఎలా సోకిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts