దళిత రైతు తల నరికిన దుండగులు..!

September 23, 2020 at 8:03 pm

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొలానికి నీళ్లు వదలడానికి నిరాకరించిన దళిత వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఈ ఘటన యూపీ పరిధిలోని షేక్‌పూర్ గ్రామంలో జరిగింది. మృతుడి కుమారుడు చెప్పిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరు పొలం పనులు చేయడానికి వెళ్లారు. అయితే మృతుడి కొడుకుని ఇంటికి వెళ్లి భోజనం సిద్ధం చేయమని చెప్పడంతో అతను ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే మరసటి రోజు ఉదయం అయినా తండ్రి ఇంటికి రాలేదు. దీంతో కొడుకు పొలం దగ్గరికి వెళ్లి చూడగా తండ్రి విగత జీవిగా పడి ఉండటం చూశాడని తెలిపారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని స్థానికులను విచారించారు. ఈ విచారణలో పక్క పొలం రైతు తన పొలానికి నీళ్లు వదలమని అడిగాడని దానికి మృతుడు నిరాకరించడంతో అతడిని కొట్టారని గ్రామస్తులు సాక్ష్యం చెప్పారు. ఇక వాళ్ళు అడ్డుకోవడానికి వెళ్తే అడ్డువచ్చిన వారిని కూడా చంపుతా అంటూ బెదిరించాడని వారు తెలిపారు. నిందితుడు పరారిలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

దళిత రైతు తల నరికిన దుండగులు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts