తాగునీటి కోసం ఏకంగా కొండ‌నే త‌వ్వారు..ఎక్కడంటే ..?

September 28, 2020 at 12:03 pm

ద‌శ‌ర‌థ్ మాంఝీ గురించి అంద‌రికీ తెలిసిందే. త‌న గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేసేందుకు ఏకంగా సంవ‌త్స‌రాల పాటు క‌ష్ట‌ప‌డి ఓ కొండ‌నే తొలిచాడు. ఎట్ట‌కేల‌కు అనుకున్న‌ది సాధించాడు. ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి వెలుగులోకి వ‌చ్చింది. తాగునీటి కోసం 250 మంది మ‌హిళ‌లు కొంగు న‌డుముకు చుట్టారు. 18 నెల‌ల పాటు క‌ష్ట‌ప‌డి అర‌కిలోమీట‌రు మేర ఓ కొండ‌నే తొలిచారు. చివ‌ర‌కు జ‌లాన్ని సంపాదించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. ఈ సంఘ‌ట‌న మ‌ధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. వివ‌రాల్లోకి వెళితే..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో శిల్ప సౌంద‌ర్యానికి పేరొందిన ఖ‌జుర‌హో ఆల‌యాల‌కు నెల‌వైన చ‌త్త‌ర్‌పూర్ జిల్లాలోని మారుమూల గ్రామ‌మైన అంగోత్ర ద‌శాబ్దాలుగా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. క‌నీస తాగునీటి వ‌స‌తి కూడా అందుబాటులో లేని దుస్థితి. నాయ‌కులు హామీలు ఇచ్చినా అవి నీటి మీది రాత‌లుగానే మిగిలిపోయాయి. అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌రోవైపు రోజురోజుకూ తాగునీటి స‌మ‌స్య పెరిగిపోసాగింది. అయితే అడ‌విలో పారే నీళ్ల‌ను గ్రామంలోని చెరువుకు మ‌ళ్లించుకుంటే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని మ‌హిళ‌లు గుర్తించారు. కాక‌పోతే అడ‌వి, చెరువుకు మ‌ధ్య‌లో ఉన్న ఓ కొండ‌ను అర‌కిలో మీట‌ర్ మేర త‌వ్వాల్సి ఉంటుంది. ఆ ప‌నిని ఇంట్లోని మ‌గ‌వాళ్ల‌కు చెబుదామంటే వారు పొద్దంతా ప‌నికి వెళ్లి సాయంత్రం వ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే గ్రామంలోని మ‌హిళ‌లంతా జ‌ల్ స‌హేలీ పేరిట ఏక‌మ‌య్యారు. కొంగున‌డుముకు చుట్టారు. సుమారు 250 మంది మ‌హిళ‌లు, 18 నెల‌ల పాటు శ్ర‌మించి కొండ‌ను అర‌కిలోమీట‌ర్ మేర తవ్వారు. చివ‌ర‌కు తాము అనుకున్న‌ది సాధించి ఇప్పుడు అంద‌రి ప్ర‌శంస‌ల‌ను పొందుతున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మ‌హిళ‌లు మాట్లాడుతూ ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌మ గ్రామాన్ని గుర్తించాల‌ని వారు కోరారు. ‌

తాగునీటి కోసం ఏకంగా కొండ‌నే త‌వ్వారు..ఎక్కడంటే ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts