దాసరికి టీవీ9 దేవి ఎంత దగ్గరి బంధువో తెలుసా?

September 26, 2020 at 9:28 am

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ ఇటీవ‌ల అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్‌లో ప్రముఖ వార్త సంస్థ టీవీ 9కి చెందిన సీనియర్‌ యాంకర్ దేవి నాగ‌వ‌ల్లి కంటెస్టెంట్‌గా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటి వరకు లేడీ బిగ్ బాస్ విన్నర్ లేదు. కనుక తాను లేడీ బిగ్ బాస్ విన్నర్ అవుతాను అంటూ ముందుకు వచ్చిన దేవి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరేమో.

విచిత్ర వ‌స్త్ర‌ధార‌ణ‌, హెయిల్ స్టైల్‌తో క‌నిపించే రాజ‌మండ్రికి చెందిన దేవి నాగ‌వ‌ల్లి.. బిగ్ బాస్ హౌస్‌లో త‌న‌దైన శైలిలో ఆటాడుతూ మూడోవారం నామినేషన్‌లో నిలిచింది. ఈ క్ర‌మంలోనే ఆమెను సేవ్ చేసేందుకు అభిమానులు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో దేవికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

దివంగత దాసరి నారాయణ రావు గారికి టీవీ 9 దేవికి చాలా ద‌గ్గ‌ర బంధుత్వం ఉందట‌. దాస‌రికి దేవి స్వ‌యాన మ‌న‌వ‌రాలు అవుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని దేవి త‌ల్లి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. దాసరి నారాయణ రావుగారు మా అత్తయ్య తమ్ముడు.. మా ఆయనకు మేనమామ.. దేవికి తాత అవుతారు. మేం వాళ్ల ఇంటికి వెళ్తూ ఉంటాము.. ఏదైనా సందర్భం ఉంటే దాసరి ఫ్యామిలీని కలుస్తూ ఉంటాము. అయితే దాసరి నారాయణ రావుగారిని మేం ఎప్పుడూ ఉపయోగించుకోలేదు అంటూ దేవి త‌ల్లి వివ‌రించారు.

దాసరికి టీవీ9 దేవి ఎంత దగ్గరి బంధువో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts