ఏపీలో తగ్గిన కరోనా తీవ్రత… నేడు కొత్తగా 6133 పాజిటివ్ కేసులు..!

September 30, 2020 at 6:44 pm

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక నేడు తాజాగా ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్ బులిటెన్ ను మీడియా కు అందించింది. ఇక హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో రాష్ట్ర వ్యాప్తంగా 71,806 సాంపిల్స్ ను పరీక్షించగా అందులో 6133 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,93,484 కు చేరుకుంది. ఇక గడచిన 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 48 మంది మృత్యువాత పడ్డారు. దీనితో ఇప్పటివరకు రాష్ట్రంలో 5828 మంది కరోనా వైరస్ బారినపడి మృతి చెందారు.

ఇక మరోవైపు రాష్ట్రంలో 69,353 పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 7,075 మంది కరోనా వైరస్ ను నుండి కోలుకొని ఆసుపత్రుల నుండి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. దీనిథియో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 6,26,316 మంది కు చేరుకుంది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 97174 కేసులు పాజిటివ్ గా వచ్చాయి. అలాగే 655 మంది చిత్తూర్ జిల్లాలో అత్యధికంగా మరణించారు.

ఏపీలో తగ్గిన కరోనా తీవ్రత… నేడు కొత్తగా 6133 పాజిటివ్ కేసులు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts