పోలీసుల మ‌జాకా.. ఏకంగా 17వేల పేజీల చార్జిషీట్‌

September 16, 2020 at 9:27 pm

గతేడాది డిసెంబర్లో కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 23 -26 వరకు దేశరాజధానిలో చెలరేగిన హింసకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటికే పలువురు ప్రముఖులపై చార్జిషీట్లను నమోదు చేశారు. ఇందులో డ్యాక్యుమెంటరీ చిత్రాల నిర్మాతలు రాహుల్ రాయ్, సబా దేవన్ పేర్లు వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఆ నిర్మాతలిద్దరు అల్లర్లకు మద్దతు తెలిపే ఓ వాట్సాప్ గ్రూప్లో సభ్యులుగా ఉండడమేగాక, విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాల పంపారని పోలీసులు వెల్లడించడం గమనార్హం. అల్ల‌ర్ల కేసుకు సంబంధించి కొందరిని అరెస్టు కూడా చేయడం గమనార్హం. ఫిబ్రవరిలో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలు కాగా.. అవి తర్వాత తీవ్ర రూపం దాల్చాయి. అల్లర్లలో 50 మందిపైగా చనిపోయారు. వందలాది మంది గాయపడ‌డంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది.

ఇదిలా ఉండ‌గా.. ఇప్పటి వరకు 751 కేసుల్లో 1,575 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్ల కేసులో 15 మంది నిందితులపై స్పెషల్ సెల్ పోలీసులు బుధవారం చార్జిషీట్‌ను దాఖలు చేశారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నియంత్రణ) చట్టం, ఐపీసీ, ఆయుధ చట్టాలలోని పలు సెక్షన్ల కింద 15 మంది నిందితులపై మోపిన అభియోగలతో కూడిన 17 వేల పేజీల చార్జిషీట్‌ను స్టీల్ బాక్స్‌లో భద్రపరిచి కర్కార్దూమా కోర్టులో దాఖలు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌ను ఇటీవలే అరెస్ట్ చేసిన నేపథ్యంలో వారి పేర్లు ఈ చార్జిషీట్‌లో లేవని, తర్వాత దాఖలు చేసే అనుబంధ చార్జిషీట్ లో వారి పేర్లు ఉంటాయని చెప్ప‌డం కొస‌మెరుపు. అల్లర్ల కేసులో ఇప్పటి వరకు 21 మందిని అరెస్ట్ చేయగా, వారిలో 15 మందికి సంబంధించి లభించిన ఆధారాలు, దర్యాప్తు ఆధారంగా చార్జిషీట్ ను దాఖలు చేశారు. మరో ఆరుగురికి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు లభించిన తర్వాత అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేయ‌నున్న‌ట్లు పోలీసులు తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

పోలీసుల మ‌జాకా.. ఏకంగా 17వేల పేజీల చార్జిషీట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts