అయోధ్య ధన్నీపుర్​లో నిర్మించే మసీదు రూపకర్త సిద్ధం..!

September 2, 2020 at 4:04 pm

అయోధ్య ధన్నీపుర్​లో నిర్మించే మసీదు రూపకర్తగా జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్​ విభాగాధిపతి ఎస్​ఎం అక్తర్ నియమితులయ్యారు. ఈ మసీదును ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్ట్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులో తన విద్యార్థులు కూడా భాగస్వాములు అవుతారని అక్తర్ వెల్లడించారు.విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సెంటర్, ఆసుపత్రి తదితర నిర్మాణాలకు అక్తర్​ ఆర్కిటెక్ట్​గా పనిచేశారు. కొన్ని స్థానిక ప్రాజెక్టుల్లోనూ ఢిల్లీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అయోధ్యను సందర్శించే అవకాశం లేదని ఆయన అన్నారు.

కానీ, ఇంతకుముందే ఆ ప్రాంతాన్ని సందర్శించానని చెప్పారు.అయోధ్య తీర్పులో భాగంగా మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ధన్నీపుర్​లోని 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్​ బోర్డుకు అందించింది యోగి ప్రభుత్వం. ఇక్కడ మసీదు నిర్మాణం కోసం 15 మంది సభ్యులతో ఐఐసీఎఫ్ ట్రస్ట్​ను ఏర్పాటు చేసింది బోర్డు.మసీదుతో పాటు ఆసుపత్రి, ప్రజా గ్రంథాలయం, ఇండో-ఇస్లామిక్ వారసత్వ సంపద కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ట్రస్ట్ వెల్లడించింది.

అయోధ్య ధన్నీపుర్​లో నిర్మించే మసీదు రూపకర్త సిద్ధం..!
0 votes, 0.00 avg. rating (0% score)